కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు

ఈ కార్ రేస్ కేసులో తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై ఏ2గా హెచ్ఎండీఏ కమిషనర్ గా గతంలో పనిచేసిన బీఎల్ఎన్ రెడ్డి పై ఏ3 గా కేసు నమోదు చేశారు. వీరిపై 13 ఏ, 13 (2), 409, 120 (బీ) సెక్షన్ల కింద ఏసీబీ కేసులు పెట్టారు.