బాలీవుడ్ లో అగ్రహీరోలంతా ఒక సామాజిక వర్గానికి చెందినవారే. మరోవర్గానికి చెందిన వారిని ప్రోత్సహించి బాలీవుడ్ పాలిటిక్స్ ను శాసించాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఉత్తరాదికి చెందిన వారే బాలీవుడ్ లో కీలకంగా ఉన్నారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ నటులను ప్రోత్సహించేదిశగా కాషాయ పార్టీ అడుగులు వేస్తున్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. దక్షిణాదిలో సినీ రంగప్రముఖులు హేమమాలిని, విజయశాంతి, శారద, కైకల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నరేశ్ తదితర నేతలు నేరుగా బీజేపీలో పనిచేసిన వారే. కొత్తగా దక్షిణాదిలో రాణిస్తున్న అగ్రశ్రేణి నటులను తమవైపు తిప్పుకునే దిశగా బీజేపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తే.. బీజేపీ కేసులు పెట్టిన విధానాన్ని ఖండించింది. అల్లు అర్జున్ కు అండగా ఉంటామని బీజేపీ ప్రకటించింది. గతంలో తెలంగాణలో పర్యటించిన సందర్భంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా… జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. గతంలో బహుబలి హిట్ తర్వాత ప్రభాస్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. బహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప చిత్రాలకు ఉత్తరాదిలో మంచి ఆదరణ లభించింది. దీంతో దక్షిణాది నటులను ప్రోత్సహించి లబ్దిపొందాలని కాషాయ పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తమిళనాడు సినీ పరిశ్రమలో రాణించిన విజయ్ దళపతి… పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆరంభసభతోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు. తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. విజయ్ దళపతి స్థాపించిన టీవీకే తో పొత్తు పెట్టుకుని భవిష్యత్ రాజకీయాలను శాసించాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరగుతోంది. ఇప్పటికే తమిళనాడులో కుష్భులాంటి వాళ్లు బీజేపీలో పనిచేస్తున్నారు.
కేరళలో స్టార్ నటుడు సురేశ్ గోపీ… బీజేపీ నుంచి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించారు. కేరళలో బీజేపీ ఖాతా తెరవడంలో సురేశ్ గోపీ కీలకంగా వ్యవహరించారు.
బాలీవుడ్ లో దక్షిణాది నుంచి పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు. రజనీకాంత్, చిరంజీవిలాంటి వాళ్లు బాలీవుడ్ ను శాసిస్తారని ఆశించినా.. ఆ స్థాయిలో అక్కడ సక్సెస్ కాలేకపోయారు. బాలీవుడ్ ఓ వర్గం గుప్పిట్లోనే ఉండిపోతుందనే ఆందోళన ఎక్కువైపోయింది. దీంతో దక్షిణాదిలో రాణిస్తున్న నటులను ప్రోత్సహించి… బాలీవుడ్ లో తమ వర్గం పట్టు సాధించేలా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ది కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్, రజాకార్ లాంటి చిత్రాలను నేరుగా బీజేపీ ప్రోత్సహించింది. సినిమాలు, నటులను ప్రోత్సహించి కమలదళం కొత్త లెక్కలు… పాచికలు బాలీవుడ్ లో ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.