• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, May 19, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
Fact News
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
No Result
View All Result
Fact News
No Result
View All Result
Home నేటి వాస్తవాలు

CM REVANTHREDDY

by Fact News Team
December 26, 2024
in నేటి వాస్తవాలు
0
0
SHARES
48
VIEWS
Share on FacebookShare on Twitter

తొక్కిసలాట

–కొత్త సినిమా గురూ !
– కథ, స్క్రీన్​ ప్లే, దర్శకత్వం, హీరో
– అన్నీతానై నడిపిన రేవంత్​
– సినీపెద్దల ముందు సీఎం సిన్మా !!

సినిమా చూపిస్తా మామా అంటూ సీఎం రేవంత్​… తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త సినిమా చూపించారు. ఈ సినిమాలో అన్ని తానై కథ నడిపించారు. కథానాయకుడిగా సినీపరిశ్రమను తనవద్దకు రప్పించుకున్నారు. తొక్కిసలాట సినిమా చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో తానేందుకు అంతగా రియాక్ట్​ కావల్సివచ్చిందో సినీ ప్రముఖులకు వివరించారు. బంజారాహిల్స్​ లోని పోలీస్​ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ లో సినీప్రముఖులతో సీఎం రేవంత్​ పాల్గొన్నారు. 45 మంది సినీ ప్రముఖులను సమావేశానికి ఆహ్వానించారు. సినీరంగ పెద్ద మనిషిగా భావించే అన్నయ్య చిరంజీవి.. ఈ సమావేశానికి రాలేదు. సినిమా షూటింగ్స్​ కారణంగా రేవంత్​ తో భేటీకి రాలేదని చెబుతున్నారు. ఇక దబిడదబిడ చేసే బాలయ్య బాబు సైతం సీఎం రేవంత్ భేటీకి దూరంగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రితో తెలంగాణ ఫిల్మ్​ డెవలప్​ మెంట్​ కార్పోరేషన్​ ఛైర్మన్​, ప్రముఖ నిర్మాత దిల్​ రాజు, అల్లు అరవింద్​, మురళీమోహన్​, శ్యాంప్రసాద్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే తొలి అంశంగా సంధ్యా థియేటర్​ లో జరిగిన తొక్కిసలాట ఘటనపైనే చర్చించారు. మహిళ మృతి చెందిన కారణంగానే తొక్కిసలాట ఘటనను సిరియస్​ గా తీసుకున్నట్లు చెప్పారు సీఎం రేవంత్​. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వివరించారు. బౌన్సర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్​ ఇచ్చారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రెటీలే బాధ్యత వహించాలని సూచించారు.

సమావేశంలో సినీప్రముఖులకు తొక్కిసలాట రోజు జరిగిన ఘటన విజువల్స్​ ను సీఎం చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. 9 నిమిషాల తొక్కిసలాట వీడియో ప్రదర్శించినట్లు పలువురు చెబుతున్నారు. ఫిల్మ్​ డెవలప్​మెంట్​ కార్పోరేషన్​ ఛైర్మన్​ దిల్​ రాజు మాత్రం సీఎం తమకు ఎలాంటి వీడియోలు చూయించలేదని వివరణ ఇచ్చారు. కొన్న ఛానెళ్లలో సినిమా చూపించినట్లు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. బెనిఫిట్​ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చర్చకు రాలేదని దిల్​ రాజు వివరించారు. సినీపరిశ్రమ అభివృద్ధిపైనే రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలవాతావరణంలో చర్చలు జరిగినట్లు వివరించారు. ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి మాత్రం సినిమా ఇష్యూస్​ అన్నీ ఇక క్లోజ్​ అంటూ ప్రకటించారు.

సినీరంగ సమస్యలపై మంత్రివర్గం ఉపసంఘం వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్​ షోలు తదితర అంశాలపై క్యాబినెట్​ సబ్​ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే త్వరలోనే సినిమారంగ ప్రముఖులతో మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. సంక్రాంతికి కొత్త సినిమాలు రాబోతున్న నేపథ్యంలో క్యాబినెట్​ సబ్​ కమిటీ వేసి.. నివేదిక సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశముంది. బెనిఫిట్​ షోలపై ఇప్పటికే సీఎం రేవంత్​ రెడ్డి క్లారిటితో ఉన్నారు.బెనిఫిట్​ షోలు అనుమతించేది లేదని ప్రకటించారు. బెనిఫిట్​ షో పేరుతో కాకుండా మరోపేరుతో షోలకు అనుమతి ఇవ్వవచ్చని సినిమా వర్గాలు ఆశిస్తున్నాయి.

Fact News Team

Fact News Team

Next Post
ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో వైఎస్‌ జగన్ #ysrcp #ysjgan #pulivendula #ycp #localpolitics@factnews7447

ప్రజాదర్బార్‌ కార్యక్రమంలో వైఎస్‌ జగన్ #ysrcp #ysjgan #pulivendula #ycp #localpolitics@factnews7447

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

#pawankalyan #alluarjun #chitchat #appolitics @factnews7447 #ysjagan #janasena #apgovt

#pawankalyan #alluarjun #chitchat #appolitics @factnews7447 #ysjagan #janasena #apgovt

5 months ago
DAVOS Day-2: గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై దావోస్‌లో సీఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి@factnews7447

DAVOS Day-2: గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై దావోస్‌లో సీఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి@factnews7447

4 months ago

Popular News

    Connect with us

    Newsletter

    Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
    SUBSCRIBE

    Category

    • నేటి వాస్తవాలు
    • వీడియోలు

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org

    About Us

    We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2025

    No Result
    View All Result
    • Home

    © 2025

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In