తెలంగాణలో సంధి రాజకీయాలు !
తెలంగాణలో పాలక, ప్రతిపక్షాల మధ్య సంధి కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయా ?
కొన్ని అంశాల్లోనైనా పాలక, ప్రతిపక్షాలు కలిసిపోవాలన్న విద్యాసాగర్ రావు మాటల వెనక మర్మమేంటీ ?
రేవంత్ ముందు ఆ ప్రస్తావన ఎందుకు పెట్టారు ? ఎవరి కోసం ఆయన అలా మాట్లాడారు ?
అసలు విద్యాసాగర్ రావు ఏమన్నారు ? ఆయన మాటల వెనక మర్మమేంటీ ?

తెలంగాణలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ పై సందర్భం వచ్చిన ప్రతీసందర్భంలో భగ్గుమంటున్నారు. కానీ అదే రేవంత్ ముందు.. పాలక, ప్రతిపక్షాలు కొన్ని సందర్భాల్లోనైనా కలిసి వెళ్లాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు హితవు చెప్పడంలో వెనక ఆంతర్యమేంటోనని పలువురు చర్చించుకుంటున్నారు. బీజేపీ నేత, మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు స్వీయ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వేదికపై రేవంత్ రెడ్డి… విద్యార్థి పరిషత్ తో ఉన్న అనుబంధాన్ని సైతం గుర్తు చేసుకున్నారు.
విద్యాసాగర్ రావు… కమ్యూనిస్టు కుటుంబంలో పుట్టిన కాషాయవాది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. క్లిష్ట పరిస్థితుల్లో మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్ గా సేవలు అందించారు. ప్లీడర్ నుంచి గవర్నర్ దాకా ఏ పని చేసినా…విద్యాసాగర్ రావు సక్సెస్ ఫుల్ గా బాధ్యతలను నిర్వర్తించారు. గోదావరి జలాల వినియోగం, సెప్టెంబర్ 17 అంశాల పేరు వింటేనే విద్యాసాగర్ రావు పేరు గుర్తుకు వస్తాయి.
ఉనిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు మాటలకు అర్ధామేంటో అని కమలనాథులు చర్చించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు పూర్తి స్థాయిలో అప్పటి సీఎం కేసీఆర్ కు సహకరించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ కొనసాగుతోంది. ఈ కార్ రేసు కేసును ఈడీ, ఏసీబీ దర్యాప్తు చేస్తున్నాయి. పాలక, ప్రతిపక్షాలు ప్రతీ అంశంలోనూ మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంలో విద్యాసాగర్ రావు… అధికార, ప్రతిపక్షాలు కలిసిపోవాలని ఏ ఉద్దేశ్యంతో అన్నారనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సమరసింహారెడ్డి పెట్టిన ప్రైవేటు బిల్లును సభ ఆమోదించిన విషయాన్ని విద్యాసాగర్ రావు గుర్తు చేశారు.
హైడ్రా పనితీరును ప్రశంసించడం… మూసీ సుందరీకరణ చేయాల్సిందేనని విద్యాసాగర్ రావు మాటలను బీజేపీ అధిష్టానం ఎలా చూస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. మొత్తంగా తెలగాణ బీజేపీలో విద్యాసాగర్ రావు మాటలు మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.
……………………………………………. Fact News team