మాఘ మాసంలో మౌనం వీడేనా ?
గులాబీ బాస్ కేసీఆర్ లెక్కేంటి ?
ఆయన మౌనం వెనక కారణాలేంటీ ?
ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు ?
కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు వస్తారు ? కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తారా ?
బహిరంగసభ ఎక్కడ, ఎప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు ? తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పుతారా ?


గులాబీ దళపతి బయటకు ఎప్పుడు వస్తారనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసిన కేసీఆర్.. తర్వాత బయటికి రాలేదు. పూర్తిగా ఫాంహౌజ్ కే పరిమితమయ్యారు. ఓ వైపు కేటీఆర్ రైతు దీక్షల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నిర్వహించిన రైతు ధర్నాలు సక్సెస్ చేసి కేటీఆర్ క్యాడర్లో జోష్ నింపారు. ఇక హరీష్ రావు సందర్భోచితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. ఇంకోవైపు కవిత కూడా యాక్టివ్ గా నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వంపై కేటీఆర్, హరీష్, కవిత ముగ్గురు.. ముప్పేట దాడి చేస్తున్నా… కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారోనని బీఆర్ఎస్ క్యాడర్ మాత్రం ఎదురుచూస్తోంది. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ పై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వచ్చేది మాఘమాసం… మూహూర్తం చూసుకుని కేసీఆర్ పాలిటిక్స్ పై ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్న కేసీఆర్.. ఫిబ్రవరిలో జరిగే బహిరంగ సభ వేదికపై ప్రసంగించే ఛాన్స్ ఉంది. ఈ సభ వేదక నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలోఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 హామీలపై ప్రభుత్వాని ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సమయత్నం అవుతుంది. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన..హామీలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమయ్యిందో ప్రజలకు వివరించనున్నారు. కాంగ్రెస్ చెప్పిన ప్రతి అంశాన్ని సభ వేదిక నుంచే ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15 వరకు మొత్తం రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఇప్పటికే బీఆర్ ఎస్ పదే పదే విమర్శలు గుప్పిస్తుంది… కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
వరంగల్ డిక్లరేషన్ ను పూర్తిగా అమలు చేయాలంటూ బీఆర్ ఎస్ కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకరావాలని నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చిన హామీ రుణమాఫీ , రైతు భరోసా విషయాల్లో కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలుగు వందలకు పైగా రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని బీఆర్ఎస్ అంటుంది. బీఆర్ ఎస్ పార్టీ సీనియర్ల నాయకుల ఆధ్వర్యంలో రైతుల కోసం అద్యాయన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ చనిపోయిన రైతు కుటుంబానికి లక్ష రూపాయాల ఆర్థిక సహాయం చేస్తుంది. కమిటీ నెల రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నివేదిక ఇవ్వనుంది.
ప్రభుత్వ పాలనను ఏడాదిపాటు నిశితంగా గమనించిన కేసీఆర్… పార్టీ క్యాడర్ లో జోష్ నింపేందుకు ఏం చేయబోతున్నారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.