
ఏపీలో కూటమి ప్రభుత్వం పోసాని మురళీకృష్ణను అరెస్ట్ చేసింది. సినీరంగాన్ని, నంది అవార్డులపై, చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆయనపై 11 చోట్ల కేసులు నమోదు చేశారు. పోసాని కృష్ణమురళీపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు. అధికారంలో ఉండగా పోసాని మురళీకృష్ణ అధికారంలో ఉండగా దుర్మార్గంగా వ్యవహరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓబులవారిపల్లె పీఎస్ కు పోసాని మురళీకృష్ణను తరలించారు. పోసాని స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత… కోర్టుకు తరలించనున్నారు. మరోవైపు న్యాయవాదులు పోసానికి బెయిల్ పిటిషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి వైసీపీకి రాజీనామా చేసిన పోసాని మురళీకృష్ణను తాజాగా టీడీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. మొత్తానికి పోసాని అరెస్ట్ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.