సినీ నటులు.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన ఎగ్జాంపుల్స్ చాల ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పొలిటికల్ లీడర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భం లేదు. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. పొలిటికల్ లీడర్.. సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సదరు నేత సినిమాకు సంబంధించిన పోస్టర్ తెలంగాణ పాలిటిక్స్ లో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న నేత ఎవరు..? ఆ నేత సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారు..?

జగ్గారెడ్డి అలియాస్ జయప్రకాశ్ రెడ్డి..
తెలంగాణ కాంగ్రెస్‌లో డిఫరెట్ టైప్ ఆఫ్ పొలిటిషియ్. పాలిటిక్స్‌లో జగ్గారెడ్డిది రూటే సపరేటు. ఆయన ఏం మాట్లాడినా పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌గా మారుతుంది. వైరి పక్షాలతో పాటు కొన్ని సందర్భాల్లో స్వంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతుంటారు. పొలిటికల్‌గా హల్ చల్ చేసే జగ్గారెడ్డి ఆల్ ఆఫ్ సడెన్‌గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయ్యారో లేదో అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఆయన పేరుతోనే జగ్గారెడ్డి .. ది వార్ ఆఫ్ లవ్ అంటూ పోస్టర్ రిలీజ్ అయ్యింది. తన పేరుతో సినిమా ఎలా ఉండబోతుందో కూడా పోస్టర్ ద్వారా జగ్గారెడ్డి చెప్పకనే చెప్పారు.
పొలిటికల్ అంశాలతో నిత్యం వార్తలలో నిలిచే జగ్గారెడ్డి జీవనశైలి కాస్త డిఫరెంట్ అనే చెప్పవచ్చు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండే జగ్గారెడ్డి.. ఎవరికి అంత ఈజీగా టచ్‌లోకి రారు. ఎవరికి ఫోన్ లో అందుబాటులోకి రారు. ఎవరికైనా సరే ఆయన మాట్లాడాలనుకుంటే.. ఆయనే టచ్ లోకి వస్తారు. ఇక పండుగల విషయంలో తన స్వంత నియోజకవర్గం సంగారెడ్డిలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. దసరా పండుగకు రావణసంహార కార్యక్రమం… జగ్గారెడ్డి చేసే పొగ్రామ్ ఒక హైలెట్‌గా నిలుస్తుంది. శివరాత్రి వచ్చిందంటే చాలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు రాత్రిపూట జాగారం సందర్భంగా కల్చరల్ పొగ్రామ్స్ ఏర్పాటు చేయడం ఆనవాయితీ పెట్టుకున్నారు. శివభక్తుడైన జగ్గారెడ్డి .. పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందు గ్రాండ్ గా ఇస్తుటారు.. అంత గ్రాండ్‌గా ఏర్పాట్లు ఉంటాయి. ఇలా ప్రతీ విషయంలో జగ్గారెడ్డి అంటే ఒక రేంజ్‌లో హడావిడి ఉంటుంది.


ఇప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న జగ్గారెడ్డి … ఎంట్రీ కూడా ఓ లెవల్లో చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి .. ది వార్ ఆఫ్ లవ్ అంటూ సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు. సినిమా పూర్తిగా జగ్గారెడ్డి నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని.. సినిమాలో లవ్ ఎపిసోడ్ ఉంటుందంటుని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగ్గన్న ప్రేమను డైలాగ్ ల వరకే పరిమితం చేస్తారా ? రోమాంటిక్ సీన్స్.. సాంగ్స్ ఏమైనా చేస్తారా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సో.. మొత్తం మీద జగ్గా రెడ్డి సినిమా ఎపిసోడ్ ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ అఫ్ ది టాపిక్ గా మారింది. చూడాలి సినిమా లో ఏ యే అంశాలను ప్రస్తావిస్తారు.. ఎలాంటి వాటిని హైలెట్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది