
రాములమ్మ పోరాటం ఫలించిందా ?
ఎమ్మెల్సీ కట్టబెట్టడం వెనక మర్మమేంటీ ?
రేవంత్ కు తెలియకుండానే ఛాన్స్ కొట్టేశారా ?
తెరపైకి సడెన్ గా రావడం వెనక పనిచేసిన శక్తులు ఎవరు ?
రాములమ్మ.. కర్తవ్యం.. ఇలా ఎన్నో హిట్ మూవీల్లో నటించి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న విజయశాంతి.. మధ్యలో కొన్నాళ్లు ఎక్కడా కనిపించడం లేదు. సరిలేరూ నీకేవ్వరూ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత మాయమైపోయారు. సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా రాణించినా… పొలిటికల్ గామాత్రం కొన్నాళ్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మెదక్ ఎంపీగా గతంలో పనిచేసిన రాములమ్మ… తాజాగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అవకాశం కల్పించింది.
ఆమె యాక్టర్ కమ్ పొలిటిషియన్..
నాడు ఎన్నో హిట్ మూవీస్ చేశారు.. ఆ తర్వాత పొలిటికల్ గా రాణించారు.
ఆమె ఢిల్లీ నుంచే చక్రం తిప్పి తెలంగాణ శాసన మండలిలో అడుగు పెట్టడానికి స్కెచ్ గీశారు.
రాజకీయాల్లోనూ మళ్లీ యాక్టీవ్ మోడ్ లోకి రాబోతున్నారు,
విజయశాంతి గాడ్ ఫాదర్స్ ఎవరనేదానిపై కాంగ్రెస్ లో డిస్కషన్ మొదలైంది.
సినిమారంగంలో మంచి హవా కొనసాగుతున్న రోజుల్లోనే… బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్.కే.అద్వానీకి దగ్గరగా పనిచేశారు. అద్వానీ రథయాత్రల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె బీజేపీకి గుడ్ బై చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్ లో విలీనంచేశారు. కేసీఆర్ స్వయంగా విజయశాంతిని పదో చెల్లిగా అభివర్ణించారు. అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన సందర్భంలో ఆమె బీఆర్ఎస్ నుంచి లోక్ సభలో ఉన్న ఏకైక ఎంపీ. ఆ తర్వాత కేసీఆర్.. ఆమెను పార్టీ నుంచి పక్కనపెట్టారు. వెంటనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ పొలిటికల్ గా మళ్లీ టర్న్ తీసుకున్నారు. 2019 ఎన్నికలు ముగిసిన వెంటనే.. మళ్లీ బీజేపీ గూటికి చేరుకున్నారు విజయశాంతి. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే… ఆమె మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పెద్దగా ప్రయార్టీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు, కాంగ్రెస్ పార్టీఅధికారంలో వచ్చిన కొత్తలో ఎక్స్ లో ట్విట్లు చేస్తూ… నేనున్నాను అని గుర్తు చేస్తూ ఉండేది. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడాదిన్నరగా లైట్ తీసుకున్నారు. సడెన్ గా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఏఐసీసీ విజయశాంతి పేరు చేర్చడంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ముక్కున వేలేసుకున్నారు. ఎలా వచ్చిందబ్బా ఛాన్స్ అంటూ గుసగుసలు మొదలుపెట్టారు. సీఎం, పీసీసీ ఛీప్ లకు విజయశాంతి ఈక్వేషన్స్ అర్ధంకాక తలలుపట్టుకుంటున్నారు.
ఎమ్మెల్సీ వరకు ఓకే…. రేపొద్దున మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానం ఆర్డర్ వేస్తే పరిస్థితి ఎంటోనని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డారట. మొత్తానికి టీ కాంగ్రెస్ నేతలకు రాములమ్మ పెద్ద ఝలక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు.