
బలూచిస్తాన్. మూడు దేశాల కబ్జాకోరల్లో చిక్కుకున్న దేశం. ఇరాన్, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్ ల మధ్య నలిగిపోతోంది బలూచిస్తాన్. స్వాతంత్రం కోసం బలూచ్ వీరులు పోరాడుతూనే ఉన్నారు. పాకిస్థాన్ ఏర్పాటుకు ముందే బలూచిస్తాన్ స్వతంత్ర రాజ్యం. పాకిస్తాన్ అవతరించాక బలూచిస్తాన్ ను బలవంతంగా ఆక్రమించుకుంది పాక్. కుట్రపూరితంగా తమలో కలుపుకుంది. నాటిమ నుంచి బలూచ్ పౌరులు చేస్తోన్న పోరాటాన్ని అత్యంత దారుణంగా అణిచివేయడం ప్రారంభించింది ఉగ్రదేశం. బలూచిస్తాన్‌ని భూతల నరకంగా మార్చేసిన పాకిస్తాన్… అక్కడి ప్రజలను నిత్యం కాల్చుకు తింటోంది. దీంతో బలూచ్ ఫ్రీడమ్ ఫైట్‌లో మిలిటెంట్ పోరాటాలు పుట్టుకొచ్చాయి. పాక్ కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం ఎంత వరకైనా తెగించే స్థితిలో బలూచ్ ఉద్యమకారులు వచ్చేశారు.
బలూచిస్థాన్ ప్రాంతం నైరుతి పాకిస్థాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ అఫ్గానిస్థాన్‌లలో వ్యాపించి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన స్థానిక తెగే బలూచీ ప్రజలు. శతాబ్దాలుగా బాహ్య శక్తుల ప్రాబల్యం, భౌగోళిక రాజకీయ పరిణామాల్లో వీరు తమ ప్రత్యేక గుర్తింపును నిలుపుకొన్నారు. బలూచ్ వాసుల్లో 50శాతం పాకిస్థాన్‌లోని బలూచ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. 40శాతం సింధ్‌లో, కొద్దిమంది పాక్‌లోని పంజాబ్‌లో నివాసం ఉంటున్నారు. పాక్ మొత్తం జనాభాలో వీరి వాటా 3.6శాతం. ఇరాన్, అఫ్గానిస్థాన్ జనాభాలో రెండు శాతం బలూచ్ ప్రజలు ఉంటారు. కాస్పియన్ సముద్ర తీరం నుంచి ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతాలకు తాము 12వ శతాబ్దంలో వలస వచ్చినట్లు బలూచ్ ప్రజలు నమ్ముతారు. వారిలో అత్యధికులు సున్నీ ముస్లింలు. ఇరాన్, అఫ్గానిస్థాన్‌లతో పోలిస్తే బలూచిస్థాన్‌లో సింహభాగం పాక్‌లో ఉంది. మొత్తం పాకిస్థాన్ భూభాగంలో ఇది 46శాతం దాకా ఉంటుంది. బలూచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు బలూచిస్థాన్‌ను బ్రిటిష్ ఇండియాలో విలీనం చేయక ముందు వరకూ ఆ ప్రాంతం స్వతంత్రంగా సొంత గిరిజన పాలనలో ఉండేది. ఇండియా విభజన తరవాత బలూచిస్థాన్ పాకిస్థాన్‌లో భాగం అయ్యింది. అప్పటికి అత్యధిక బలూచిస్థాన్ ప్రాంతాన్ని కలాట్ కేంద్రంగా పాలిస్తున్న రాజు తొలుత స్వతంత్ర దేశం కోసం డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌లో విలీనానికి అతడిపై తీవ్ర ఒత్తిడి వచ్చింది.
పాకిస్తాన్‌లో కలవడానికి బలూచిస్థాన్ వాసులు ఏమాత్రం అంగీకరించలేదు. నాటి నుంచే వేర్పాటు వాదం మొదలైంది. పాకిస్తాన్‌లో తాము అంతర్భాగంగా ఉండమని బలూచ్ వాసులు తెగేసి చెబుతూ వచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు చేశౄరు. పలు సందర్భాల్లో బలూచ్ జాతీయవాదులు పెద్దయెత్తున తిరుగుబాట్లు జరిపారు. పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆర్థికంగా తాము వెనకబడ్డామని బలూచ్ వేర్పాటువాదులు చెబుతున్నారు. బంగారం, వజ్రాలు, వెండి, రాగి వంటి విలువైన వనరులకు బలూచిస్థాన్ నెలవు. అయితే, ఇక్కడ నివసించే ప్రజలు నిరుపేదలు. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం నినదిస్తున్న వారిని పాకిస్తాన్ సైన్యం తీవ్రంగా అణిచివేయడంతో, వేలాది మంది మాయం చేయడంతో…2000 సంవత్సరంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏర్పడింది. నాటి నుంచి పాకిస్థాన్ సైన్యం, పోలీసులు, పౌరులు లక్ష్యంగా దాడులు చేస్తోంది. ఇప్పుడు జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేసింది కూడా బీఎల్‌ఏ మిలిటెంట్సే. పర్వతమయ బలూచిస్తాన్‌లో అపార సహజసంపద దాగి ఉంది. ఇక్కడ సహజవాయు నిక్షేపాలు ఎక్కువ. అపారమైన ఖనిజ నిక్షేపాలు, బంగారంలాంటి వనరులు ఉన్నాయి. వాటిని దోచుకుంటోన్న పాకిస్తాన్…బలూచ్ వాసులను పేదరికంలో మగ్గేలా చేస్తోంది.

తమ దేశంలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా దాన్ని పరిష్కరించుకోవడం చేతకాని పాకిస్తాన్…భారత్ మీద పడి ఏడ్వడం పాత కథే. బలూచిస్తాన్ విషయంలోనూ పాక్ ఇదే చేస్తూ వస్తోంది. బలూచ్ వేర్పాటు వాద ముఠాలకు భారత్ సహకారం అందిస్తుందని చిల్లర వ్యాఖ్యలు చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండించడం మాత్రమే కాదు. 2016 ఆగస్ట్ 15న గణతంత్రదినోత్సవ వేడుకల్లో బలూచిస్తాన్‌లో మానవ హక్కుల హననం పై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికల మీద కూడా బలూచ్ వాసుల పై పాకిస్తాన్ సాగిస్తున్న అరాచకాలను ఇండియా ఖండిస్తూ వచ్చింది. బలూచ్ ప్రజల నిజమైన సంక్షేమం, వారి సమస్యలను పట్టించుకోకుండా…వాళ్లని అణిచివేస్తూ పరిస్థితిని ఇక్కడి దాకా తెచ్చుకుంది పాకిస్తాన్.