సాంబ సెక్టార్ లో ఏం జరిగిందంటే ?
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరిగింది. సరిహద్దుల్లో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. టెన్షన్ నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ఉగ్ర చొరబాటు దారులు చొచ్చుకొస్తున్నారు. ఏడుగురు టెర్రరిస్ట్ లు సాంబ సెక్టార్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన వారిగా భావిస్తున్నారు. చొరబాటు దారుల కుట్రలను బార్డర్ సెక్యూరిటీ ఫోర్ట్ భగ్నం చేసింది. ఏడుగురు ఉగ్రవాదులను బీఎస్ఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు.