యుద్దంలో తెలుగు జవాన్ వీరమరణం
భారత్ – పాకిస్థాన్ యుద్దంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మురళీనాయక్ మృతి చెందారు. అగ్నివీర్ కింద ఎంపికైన మురళీనాయక్… జమ్మూకాశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కల్లితండాకు చెందిన గత మూడేళ్ల క్రితమే భారత సైన్యంలో చేరారు. మురళీనాయక్ మృతదేహం శనివారం సొంత ఊరికి చేరుకునే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ దొంగదెబ్బతో మురళీ నాయక్ వీరమరణం పొందారు.