
టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సూచించింది. ఇతర మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకొని మోసాలకు గురికావద్దని హితవు చెప్పింది. వైకుంఠ ఏకాదశి రోజున ఏడు కొండల వెంకన్న దర్శనం కోసం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రిలీజ్ చేశారు. మార్చి మాసంలో శ్రీవాణి టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మార్చి నెలలో శ్రీనివాసుడి ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 26వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక అదేరోజు సాయంత్రం 3 గంటలకు తిరుమలలో వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు. తిరుమల కొండపై అనామకులను నమ్మి మోసాలకు గురికావద్దని టీటీడీ అధికారులు సూచించారు. కొండపై ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్లను భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.