ప్రేమికురాలి ముచ్చట తీర్చడానికి ఓ కంప్యూటర్ ఆపరేటర్ ఏం చేశాడంటే…
లవ్ లో పడితే ఇంకో ప్రపంచమే తెలియదు.
ప్రేమను జయించడానికి ఏం చేయాలి ?
ప్రేమికురాలు మనుసు గెలవడానికి ఏం గిఫ్ట్ కొనాలి ?
లవ్ లో పడ్డ ఓ గురుడు.. తన లవర్ కోసం ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
అతని పేరు హర్షకుమార్ క్షీరసాగర్…
వయస్సు 23 ఏళ్లు..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా..
అక్కడే గవర్నమెంట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా కాంట్రాక్ట్ ఉద్యోగం..
జీతం నెలకు 13 వేల రూపాయలు…
హర్షకుమార్ తన లవర్ కు ఎయిర్ పోర్టు కు దగ్గరలో 4 BHK ఫ్లాట్ గిఫ్ట్ గా ఇచ్చాడు..
బీఎండబ్ల్యూ కారును ప్రియురాలికి ప్రేమతో ఇచ్చేశాడు…
అంతేనా వజ్రాలు పొదిగిన గాజులు లవర్ చేతికి తొడిగాడు.
నెలకు 13 వేల రూపాయలు వచ్చే హర్షకుమార్.. రిచ్ లైఫ్ స్టైల్ చూసి అంతా ఆశ్చర్యపోయారు.
అసలు హర్షకుమార్ లైఫ్ స్టైల్ ఎలా మారింది ? లవర్ కు గిఫ్ట్ లకు ఎలా సమకూర్చాడు ? ఇంట్రస్టింగ్ స్టోరీ ఎలా ఎండ్ అయ్యింది ?
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ జిల్లాలో హర్షకుమార్ ది పేద కుటుంబం. ప్రభుత్వ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హర్షకుమార్ క్షిర్ సాగర్ కంప్యూటర్ ఆపరేటర్ గా కాంట్రాక్ ఉద్యోగానికి చేరాడు. నెలకు రూ. 13 వేలు అతని జీతం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్ కావడంతో అక్కడ జరిగే ఆర్థిక లావాదేవీలు, లొసుగులు అన్నీ పసిగట్టాడు హర్షకుమార్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మోసానికి తెరలేపి జూలై నుంచి డిసెంబర్ దాకా 21 కోట్ల రూపాయలను కొల్లగొట్టాడు కేటుగాడు. ప్రభుత్వ సంస్థ మెయిల్ అడ్రస్ ను పోలి ఉండేలా నకిలీ మెయిల్ క్రియేట్ చేసి ఆఫీస్ లెటర్ హెడ్ పై బ్యాంక్ కు మెయిల్ మార్చాలని లేఖ ఇచ్చాడు. అప్పటి నుంచి నకిలీ మెయిల్ కు వచ్చే ఓటీపీలతో కోట్ల రూపాయలను తనకు మల్లించుకున్నాడు. ప్రభుత్వ సంస్థలో కోట్ల రూపాయల మాయం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో హర్షకుమార్ పరారీలో ఉన్నారు. దాదాపు 5 నెలల్లో ఇన్ని కోట్ల అక్రమాల కోసం బ్యాంక్ నుంచి ప్రభుత్వ సంస్థ డబ్బులు కొట్టేసేందుకు సంతకాల ఫోర్జరీ, నకిలీ మెయిల్, పాత లెటర్ హెడ్ లను వినియోగించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆరు నెలల తర్వాత ఈ కుంభకోణాన్ని గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న హర్షకుమార్ లైఫ్ స్టైల్ కొంతకాలంగా మారడం.. విలాసాలు.. జల్సాలు చూసి ఆఫీస్ లో పనిచేస్తున్న మిగతా సిబ్బందికి అనుమానాలు తలెత్తాయి. పోలీసుల కోణంలో విచారణ చేయగా… హర్షకుమార్ కు ఆఫీస్ లో నకిలీ మెయిల్ ఐడీ సృష్టించడం.. ఓటిపీలతో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకోవడంలో సహకరించిన యశోధ అనే మరో మహిళను పోలీసులు నిందితులుగా తేల్చారు.
మొత్తంగా లవర్ కోసం హర్షకుమార్ చేసిన తప్పిదాలతో కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది. సో… ప్రేమ వలలో చిక్కుకున్న ప్రేమికులంతా ప్రియురాలి కోసం తపించి.. తాపంతో తప్పిదాలు చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే.