ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ ప్రాధాన్యత ఏంటీ ?
కుంభమేళకు భక్తులు భారీగా తరలిరావడానికి కాణమేంటీ?
త్రివేణి సంగమం వద్ద స్నానం చేస్తే చేసిన పాపలు పోతాయా ?
కుంభమేళలో మర్రి చెట్టు దర్శన ప్రాధాన్యత ఏంటీ ?
మర్రిచెట్ట దర్శనంతోనే మోడీ, యోగి దశ మారిందా ?
స్వాతంత్ర్య సంగ్రామానికి కుంభమేళకు సంబంధముందా ?

గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభం జరగనుంది. సాధువులు మరియు జ్ఞానులు కుంభ క్షేత్రానికి చేరుకున్నారు. సనాతన ధర్మాన్ని నమ్మె ప్రతిఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా ప్రయాగ్‌రాజ్ కుంభంలో స్నానం చేయాలని కోరుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం, త్రివేణి సంగమం వద్ద స్నానం చేయడమే కాదు, మహా కుంభ యాత్రను నెరవేర్చుకోవడానికి అక్షయవత్ దర్శనం కూడా అవసరమని చరిత్ర చెబుతోంది. మహాకుంభ ప్రాధాన్యతపై స్పెషల్ స్టోరీ.
కుంభమేళలో దాగిఉన్న సైన్స్ ఏంటీ అంటే ?
కుంభమేళాలో దైవికమైన భావన, విశ్వాసంతోపాటు..సైన్స్ కూడా ఉంది. పన్నెండేళ్లకోసారి కుంభమేళకు హాజరైన వారు… తాము కనుగొన్న విషయాలు చర్చించి తీర్మానాన్ని చేసేవారు. వాళ్ల జీవితాలకు అన్వయించుకునేవాళ్లు. ప్రాచీనకాలం నాటి ఫెయిర్ వంటింది. ప్రజల అవసరాల కోసం వినియోగించేవాళ్లు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్లు వచ్చి దర్శించుకునేవారు. కొత్తఆవిష్కరణలు స్వాగతించి తీసుకెళ్లేవాళ్లు..అలా కుంభమేళా అనేది శాస్త్రీయ భావనల ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద మత మరియు సాంస్కృతిక సమావేశం. ఖగోళ శాస్త్రం ప్రకారం, గ్రహాలు మరియు నక్షత్రాలు నిర్దిష్ట స్థితిలో ఉన్నప్పుడు అర్ధ కుంభం, పూర్ణ కుంభం మహాకుంభమేళా. ఎవడు ఏ కథ రాసినా ఏది కనుగొన్నా.. అక్కడికి తీసుకువచ్చి ముద్ర వేయించుకునేవాళ్లు. కంచిమనకో సెంటర్..అ..సైన్స్ ఫెయిర్..కార్నివాల్ లా ప్రపంచానికే ఓ ప్రయోగ కేంద్రం ప్రయాగ.
యుగ ఆరంభానికి సాక్షిగా అక్షయవత్ వృక్షం….
అక్షయ వట్ అంటే వట వృక్షం (మర్రిచెట్టు). క్షయం అంటే నాశనం లేనిది కదా.. దాని గురించి… చైనా యాత్రికులు పాహియాన్, హుయాన్ సాంగ్కూడాకుంభ్ గురించి వర్ణించారు. అసలైతే ఇది సింధు నాగరికత కంటే కూడా పాతదని కొందరు అంటారు. ఇది హరప్పా మరియు మొహెంజొదారో నాగరికత కంటే 1,000 సంవత్సరాల పురాతనమైనదని చెబుతారు. క్రీ.పూ రాజవంశపు విక్రమాదిత్యుడి ఆస్థాన కవి కాళిదాసు రఘువంశంలో ప్రస్తావించారు.. హర్షుడే కుంభమేళాను ప్రారంంభించాడని…629-645 అంటారు కొన్నిచోట్ల రాశారు. తన మొదటి భారత పర్యటనలో హుయాన్సాంగ్ ప్రయాగవచ్చాడు. అప్పుడే..హర్షవర్ధన్ చక్రవర్తి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నదీ సంగమ ప్రదేశంలో ఒక ఉత్సవాన్ని నిర్వహించేవాడని మరియు అక్కడ పేదలకు కానుకలుదానాలు ఇచ్చేవాడని తన యాత్రాచరిత్రలో రాశాడు.
అందులోనే అక్షయ వట్ గురించి కూడా రాశాడు. నగరంలో ఒక ఆలయం ఉందని మరియు దానిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉందని. విస్తరించినకొమ్మలతోఉన్నదాన్నిచూసిఆశ్చర్యపోయాను.
ప్రయాగ్‌రాజ్ కుంభంలో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు అక్కడ ఉన్న అక్షయవత్ వృక్షాన్ని సందర్శించినప్పుడు మాత్రమే లభిస్తాయని చెబుతారు. సంగం ఒడ్డున ఒక పురాతన కోట ఉంది, అందులో ఈ అక్షయవత్ ఉంది. .యుగారంభలకు..యుగాంతాలకు ఇది సాక్షి అంటారు..మనంవటపత్రశాయిఅనిచదువుకుంటాంకదా..ఇక అక్షయ్ అంటే నాశనం లేనిది.. అయితే నిరంకుశ మొఘలుపాలకులు దాన్ని నాశనం చేయాలని చూశారు. వాళ్లే నాశనం అయ్యారు.ఇంకా ఆ వృక్షం ప్రయాగలో ఉంది. అక్కడ దర్శనాలు, పూజలను అక్బర్ నిషేదించాడు.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2018 సంవత్సరంలో ఇక్కడ సాధారణ ప్రజల సందర్శనపై నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చారు.దాన్నిసందర్శించారు. ప్రళయ కాల సమయంలో అంతానాశనంఅయినాఇది పచ్చగా ఉంటుందని సీత మాత అనుగ్రహించిందని ఈ మర్రి చెట్టు గురించి చెబుతారు. ఇది కాకుండా, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఈ మర్రి చెట్టుపై కూర్చున్నాడని కూడా ఒక నమ్మకం. అప్పటి నుండి, శ్రీ హరి దాని ఆకులపై నిద్రిస్తున్నాడు. అలా వటపత్రశాయి అయ్యాడేమో.

ఈ మర్రి చెట్టు వర్ణన వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. అన్నదమ్ములిద్దరూ గంగా-యమునా సంగమానికి వెళ్లాలని, అక్కడ చాలా పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుందని భరద్వాజ ముని శ్రీరాముడికి చెప్పాడని చెబుతారు. అక్కడి నుంచే అన్నదమ్ములిద్దరూ యమునానది దాటాలి. భరద్వాజ ముని అక్షయవత్ గురించి రాముడికి చెప్తూ విశాలంగా విస్తరించిన ఆవట వృక్షం నీడలో ఎందరో సిద్ధపురుషులు జీవిస్తున్నారు. సంగమంలో స్నానం చేసి అక్షయవత్ పూజ చేసిన వారికి స్నాన ఫలం లభిస్తుందని అక్షయవత్ ను దీవించిందని చెబుతారు. సృష్టి ప్రారంభంలో ప్రయాగ్‌రాజ్ సంగమం వద్ద బ్రహ్మ ఒక యాగం ప్రారంభించాడని చెబుతారు. ఇందులో మహావిష్ణువు ఆతిథ్యమివ్వగా, శివుడు దేవతగా మారాడు. యాగం ముగింపులో, ముగ్గురు దేవతలు తమ శక్తితో ఒక చెట్టును ఉత్పత్తి చేశారు, దానిని నేడు అక్షయవత్ అని పిలుస్తారు. ఇక పరిశోధకులు చెప్పేదిఈచెట్టు వయసు 5270 సంవత్సరాలు..
మొఘలుల కాలంలో అక్షయవత్ ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని చెబుతారు. ఇది కాకుండా, చాలా మంది ముస్లిం ఆక్రమణదారులు దానిని నరికి కాల్చి నాశనం చేయడానికి ప్రయత్నించారు, కాని వారు విఫలమయ్యారు. అటువంటి ఐదు మర్రి వృక్షాలు ఈ దేవబూమిలోఉన్నై…ప్రయాగ్‌రాజ్‌లో మొదటి అక్షయవత్, ఉజ్జయినిలో రెండవ సిద్ధావత్, బృందావనంలో మూడవ వంశీవత్, గయలో నాల్గవ మోక్షవత్, పంచవటిలో ఐదవ పంచవత్.
కుంభమేళలో ప్రతిజ్ఞ…
స్వాతంత్ర్య సంగ్రామానికి కుంభ్ మేళా ప్రేరణగా మారింది. భారతమాతను దాస్య శృంఖలాలనుంచి కాపాడాలని కుంభ్ కు వచ్చి ప్రతిజ్ఞ తీసుకునేవాళ్లు.. ఇదే స్వాతంత్ర్య సమరయోధులకుప్రేరణ.
మహా కుంభ్, కుంభ్ మరియు అర్ధ కుంభ్ ఎప్పుడు నిర్వహిస్తారు?
కుంభం ఐదు రకాలు – మహా కుంభం, పూర్ణ కుంభం, అర్ధ కుంభం, కుంభం మరియు మాఘ కుంభం, దీనిని మాఘ మేళా అని కూడా పిలుస్తారు. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న మహా కుంభ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని సంగమం వద్ద మాత్రమే నిర్వహిస్తున్నారు. బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించినప్పుడు మరియు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు, ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.ఇక పూర్ణ కుంభం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మరియు ప్రయాగ్‌రాజ్ – 4 పుణ్యక్షేత్రాలలో పూర్తి కుంభం జరుగుతుంది. హరిద్వార్ గంగా నదిపై, ఉజ్జయిని షిప్రా నది వద్ద, నాసిక్ గోదావరి నది వద్ద మరియు ప్రయాగ్రాజ్ గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం వద్ద ఉన్నాయి. సూర్యుడు మేషరాశిలోకి, బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహిస్తారు. అర్ధ కుంభ్ ప్రతి 6 సంవత్సరాలకు రెండు ప్రదేశాలలో మాత్రమే నిర్వహించబడుతుంది- ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్. మాఘ్ కుంభ్ ప్రతి సంవత్సరం ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే నిర్వహించబడుతుంది. సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో జరుపుకునే కుంభాన్ని సింహస్థ కుంభం అంటారు. సూర్యుడు మరియు బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు, ఈ కుంభమేళా నాసిక్‌లో జరుపుకుంటారు.
మర్రిచెట్టును కొట్టేసినా.. మళ్లీ చిగురించింది
కొంచెం చరిత్రలో ముందుకెళ్తే…మధ్యలో కుంభ్ ఆగిపోయింది. మతమార్పిడిల వల్ల,,,ఎందుకంటే ముస్లిం పాలకులు .స్నానంచేయడానికీ పన్నూ వసూలు చేశారు. జిజియాపన్నులా ..పిండ ప్రదానానికి బొట్టు పెట్టుకోవడానికీ టాక్స్ విధించేవారు.దానికీ కారణం ఉంది. మతం మార్చిన తరువాత గంగా స్నానం చేసి మర్రిచెట్టు కిందకి వెళ్లి పూర్వీకులను గుర్తు చేసుకుంటూ ధర్మంలోకి వచ్చేవాళ్లు. అందుకే విశ్వహిందూ పరిషత్ చిహ్నంగా మర్రి చెట్టు ను తీసుకున్నారు. కల్పం ప్రారంభం నుంచి ఆ మర్రివృక్షం ఉంది. వటవృక్షం కింద పిండప్రదానం చేస్తారు. అలా ప్రయాగలోనిచెట్టు ఘర్వాపసీ కేంద్రంగా ఉండేది. భయంతో , ప్రలోభాలతో మారిని వాళ్లు ఇక్కడ గంగలో మునిగి జై శ్రీరాం అని మారేవాళ్లు. బాబర్ పరిపాలన తరువాత మళ్లీ అందరూ హిందువులుగా మారారు. మళ్లీ ఎలా మారుతున్నారు. ఊళ్లకూళ్లు మారుతున్నారు.. మళ్లీ వాళ్లుమళ్లగానే హిందువులుగా అయిపోతున్నారు. అది భరించలేక ముస్లీం పాలకులు స్నానం చేసేవాళ్లకు శిక్ష విధించారు.. మర్రిచెట్టును కొట్టేయమన్నారు. అందులోనుంచి మళ్లీ ఓ కొమ్మవచ్చింది. మళ్లా మొదలైంది. అక్బర్ కాలంలో మళ్లీ కొట్టేస్తే మళ్లీ చిగురించింది. ఔరంగజేబు దాన్ని కొట్టేసి పాదరసం వేశాడు..మొత్తం కాలిపోయింది. మళ్లీ కొన్నిరోజులుమల్లీ మొదలైంది. ఈ మర్రిచెట్టు ఏమతోన్మాది కూడా కూల్చలేడు. హిందుత్వానికి ప్రతీక. ధ్వంసం చేస్తే మల్లీ పుడుతది అందుకే దాన్నివీహెచ్పీ సింబల్ గా తీసుకున్నారు. మోదీ మర్రిచెట్టుకు దండంపెట్టి వచ్చారు.
హిందూ పవిత్ర గ్రంథాలు మహా కుంభం యొక్క గొప్ప వైభవాన్ని వివరిస్తాయి.హిందూ మత గ్రంథాల్లో కుంభ్ గురించిన ప్రస్తావన ఉంది. ఇక చైనా యాత్రికుడు హుయెన్ త్సాంగ్ యొక్క ప్రయాణ కథనాలలో కనుగొనబడినప్పటికీ, అధర్వణవేదం కుంభమేళాను ప్రస్తావిస్తుంది. అధర్వణవేదం ‘చతుర్థ దదామి’ ‘పూర్ణ: కుంభోషాధికాల్ ఆహితాస్తం’ అని పేర్కొంది.