• About
  • Advertise
  • Careers
  • Contact
Monday, May 19, 2025
  • Login
No Result
View All Result
NEWSLETTER
Fact News
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
  • Home
  • నేటి వాస్తవాలు
  • వీడియోలు
No Result
View All Result
Fact News
No Result
View All Result
Home నేటి వాస్తవాలు

TARGET DANAM NAGENDAR ?

by Fact News Team
January 22, 2025
in నేటి వాస్తవాలు
0
0
SHARES
10
VIEWS
Share on FacebookShare on Twitter

దానం… ఆగమాగం…
రేవంత్​ పట్టించుకోవడం లేదా ?
పవర్​ లేకుండా పవరున్న పార్టీలో మనుగడ కష్టంగా మారిందా?
కింకర్తవ్యం !

దానం నాగేందర్​…
మూడు దశబ్ధాలుగా హైదరాబాద్​ రాజకీయాల్లో పేరున్న నాయకుడు.
ఎప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలవడం ఆయన స్పెషల్​.
ఆసిఫ్​ నగర్​ నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామ చేయడం… వైఎస్​ఆర్​ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్​ లో చేరి ఓడిపోవడం అప్పట్లో హాట్​ టాపిక్​…
ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో లాఠీలతో ఉద్యమకారులను తరిమికొట్టి వివాదాస్పదంగా దానం నాగేందర్​ వార్తల్లోకి ఎక్కారు.
ఏ పార్టీ నుంచి గెలిచినా.. ఓడినా.. ఆయన మాత్రం అధికారంలో ఉన్న పార్టీలోనే చేరడం ఖాయమని ముద్ర వేసుకున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్​ఎస్​ లో చేరిన దానం నాగేందర్​.. కొంత సైలెంట్​ గా ఉన్నారు. కేసీఆర్​ హాయంలో ఎమ్మెల్యేగానే కాలం నెట్టుకొచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ నుంచి గెలిచిన దానం నాగేందర్​… కాంగ్రెస్​ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వెంటనే మూడు రంగుల జెండా కండువాను మెడలో వేసుకున్నారు. అంతేకాదు.. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో సికింద్రాబాద్​ నుంచి ఎంపీగా పోటీచేసి బీజేపీ అభ్యర్​థి కిషన్​ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఒక పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి… మరో పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడంపై బీజేపీ నేతలు స్పీకర్​ కు ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్​ పై అనర్హత వేయాలని న్యాయస్థానం వరకు బీజేపీ నేతలు వెళ్లారు. కేసు కొనసాగుతోంది.

కాంగ్రెస్​ పార్టీలో ఆయన చేరినప్పటి నుంచి ఏదో ఓ కాంట్రావర్శీ దానం నాగేందర్​ ను వెంటాడుతూనే ఉంది. ఓ వైపు అనర్​హత పిటిషన్​.. దానం నాగేందర్​ కు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు సీఎం రేవంత్​ ఆయన్ని లైట్​ తీసుకొంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు హైడ్రా కమిషనర్​ ఐపీఎస్​ అధికారి రంగనాథ్​ .. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్​ ను టార్గెట్​ చేశారని ఆయన వర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. ఒకవైపు అనర్హత కత్తి వేలాడుతోంది. ఇంకోవైపు చేరిన కాంగ్రెస్​ పార్టీలో గౌరవం లేదు.. మర్యాద అంతకన్నా లేదు. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలని అంటారు. పార్టీ మారినా… గుర్తింపు లేకపోవడంతో లోలోపల రగిలిపోతున్నారు. ఏం చేయాలో తెలియక ఆగమాగమవుతున్నారు. దానం నాగేందర్​ పరిస్థితిపై ఆయన అనుచరులే జాలిపడాల్సిన దుస్థితి నెలకొంది.

ఖైరతాబాద్​ నియోజకవర్గంలో కట్టడాలను హైడ్రా, బల్దియా అధికారులు టార్గెట్​ చేసి కూల్చుతోంది. దానం దీనిపై సీరియస్​ గా ఉన్నారు. సీఎం దావోస్​ పర్యటనలో ఉన్నారు. రేవంత్​ రెడ్డి వచ్చే వరకు రెండు రోజులు కూల్చివేతలు ఆపాలని అధికారులను ఎమ్మెల్యే ఓ దశలో బతిమాలుకున్నంత పని చేశారు. అయినా అధికారులు మాత్రం డోంట్​ కేర్​ అనడంతో.. లా అండ్​ ఆర్డర్​ ప్రాబ్లం ఇష్యూ వస్తుందని వార్నింగ్​ ఇచ్చారు.

దానం నాగేందర్​ ముందున్న కర్తవ్యమేంటి ? ఆయన నెక్ట్స్​ ఏం చేయబోతున్నారు ? సీఎం రేవంత్​ రెడ్డి దావోస్​ నుంచి వచ్చిన తర్వాత దానంను పట్టించుకుంటారా ? అసెంబ్లీలో అనర్హత పిటిషన్​ కత్తిని చూపి.. రేవంత్​ తప్పించుకుంటారా ? దానంను వదిలించుకుంటారా ? మంత్రి వర్గంలో తీసుకుంటారా ? కాంగ్రెస్​ లో దానం ఫ్యూచర్​ ఉంటుందా ? అనే అంశాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags: congress mladanam nagendarFactNewsLatestVideosFactNewsYoutubeChanneltarget danam nagendar
Fact News Team

Fact News Team

Next Post
YSRCP Party Mahila Vibhagam State President & MLC Varudu Kalyani @factnews7447

YSRCP Party Mahila Vibhagam State President & MLC Varudu Kalyani @factnews7447

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

దేవరకద్ర ఎమ్మెల్యే  జి.మధు సూధన్ రెడ్డి ప్రెస్ మీట్ గాంధీ భవన్

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధు సూధన్ రెడ్డి ప్రెస్ మీట్ గాంధీ భవన్

2 months ago
@ysrcp @factnews7447 YS Jagan Guntur Tour | Supports Mirchi Farmers Protest Against TDP Negligence

@ysrcp @factnews7447 YS Jagan Guntur Tour | Supports Mirchi Farmers Protest Against TDP Negligence

3 months ago

Popular News

    Connect with us

    Newsletter

    Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor.
    SUBSCRIBE

    Category

    • నేటి వాస్తవాలు
    • వీడియోలు

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org

    About Us

    We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Check our landing page for details.

    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2025

    No Result
    View All Result
    • Home

    © 2025

    Welcome Back!

    Login to your account below

    Forgotten Password?

    Retrieve your password

    Please enter your username or email address to reset your password.

    Log In